అమరావతిలో ఉగాది వేడుకలు.. రూ.5 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

-

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం మరికొన్ని రోజుల్లో వచ్చేస్తోంది. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఉగాది పర్వదినాన పచ్చడి కచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. ఇక తెలంగాణ, ఏపీలోని ఆలయాలన్నీ తెలుగు సంవత్సరం వేడుకలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

ఇందులో భాగంగా ఏపీ సర్కార్ ఉగాది పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని అమరావతిలో ఈ వేడుకలు జరపనుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఉగాది వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించింది. ఇక ఈ వేడుకల్లో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news