ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న ఛార్టెడ్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆగ్రాలోని ఖేడియా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఆగ్రా పర్యటనలో ఉన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్.
ఇవాళ ఆయన తన పర్యటన ముగించుకొని బయలుదేరారు. విమానం టేకాప్ అయిన 20 నిమిషాలకు సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించిన ఫైలట్లు.. వెంటనే వెనక్కి మళ్లించారు. ముందు జాగ్రత్త చర్యగా ఖేడియా ఎయిర్ పోర్టులో దించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి మరో విమానాన్ని పిలిపించారు. అది వచ్చే వరకు దాదాపు గంటన్నర కు పైగా సీఎం యోగి ఆగ్రా ఎయిర్ పోర్టు లాంజ్ లోనే వేచి ఉన్నట్టు సమాచారం. చివరికీ మరో విమానం రావడంతో లక్నో బయలు దేరి వెళ్లారు.