కరోనా వైరస్; ఇప్పుడు ఈ పేరు వింటే చాలు ప్రపంచం భయపడిపోతుంది. అసలు ఊహకి అందని విధంగా దీని వ్యాప్తి ప్రజలను భయపెడుతుంది అనేది వాస్తవం. చలికాలం కావడంతో అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి అనేది ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనికి మందు కనుక్కోవడానికి ఎన్నో పరిశోధనలు చేస్తున్నా ఇప్పటి వరకు ఫలితం మాత్రం ఏ విధంగా కనపడటం లేదు.
చైనాలో దీని ధాటికి 200 మందికిపైగా మరణించారని సమాచారం. మరో 7000 మందికి ఈ వ్యాధి సోకినట్టు తెలుస్తుంది. చైనాతో సహా అన్ని ప్రపంచ దేశాలు కూడా ఈ వైరస్ దెబ్బకు అప్రమత్తం అయ్యాయి. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వైరస్ గురించ బ్రాహ్మం గారు కాలజ్ఞానంలో ముందే చెప్పారు అంటుంది సోషల్ మీడియా.
కాలజ్ఞానంలో 114వ పద్యంలో దీని గురించి ప్రస్తావించారు. కోరంకి అనే జబ్బు గురించి ఉంది. అది భారత దేశానికి ఈశాన్య దిక్కున ఉన్న దేశంలో పుడుతుందని రాశారు. మన దేశానికి ఈశాన్య దిక్కున ఉన్నది చైనాయే కదా. కోరంకి జబ్జుతోకోటి మంది దాకా మృతిచెందుతారని కాలజ్ఞానంలో స్పష్టంగా ఉంది. ఆ కోరంకి.. కరోనా అయితే కోటి మంది దాకా మృతిచెందుతారట. దీంతో ఆ పద్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.