అసెంబ్లీలో పట్టువిడవని విపక్షలు.. బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్

-

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ పార్టీలు వాయిదా తీర్మానాలు కోరగా.. అందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నో చెప్పారు.ఇప్పటికే ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నట్లుగా సభాపతులు ప్రకటించగా.. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, పీఆర్సీ వెంటనే అమలు చేయాలని వాయిదా తీర్మానం ఇచ్చింది.

ఇక బీజేపీ తెలంగాణలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీఓ నెం.317పై చర్చకు పట్టబడుతూ.. వాయిదా తీర్మానమిచ్చింది. మరోవైపు సీపీఐ.. దళితులు గుడిసెలు వేసుకున్న స్థలాలను వారికే కేటాయించాలని కోరుతూ.. స్పీకర్ ఆఫీసులో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇదిలాఉండగా, నేటితో సమావేశాలు ముగుస్తుండగా..స్పీకర్ అనుమతితో డిప్యూటీ సీఎం సభలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. దానిపై చర్చ ముగిశాక కేంద్రం తీసుకురాబోతున్న లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news