కొత్త ఇల్లు నిర్మాణంలో భాగంగా పాత ఇంటిని తొలగిస్తున్న క్రమంలో పురాతన శివలింగం, ఆలయ నమూనాలు బయటపడ్డాయి. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లా బనగానపల్లె-పేరుసోముల గ్రామంలో శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగు చూసింది.
స్థానికుల కథనం ప్రకారం.. ఎర్రమల అనే వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని ఇంటి కింద శివాలయం బయటపడింది. ఆ విషయం కాస్త ఊరంతా పాకడంతో పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి పూజలు చేశారు. తాము నిర్మించుకున్న ఇంటి కింద శివాలయం ఉందని తెలియడంతో ఎర్రమల కుటుంబం వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేశారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇంటి కింద బయటపడిన పురాతన శివాలయం
నంద్యాల జిల్లా బనగానపల్లె-పేరుసోముల గ్రామంలో ఘటన
ఎర్రమల అనే ఓ వ్యక్తి ఇంటి కింద శివాలయం బయటపడడంతో పెద్దఎత్తున తరలివచ్చి పూజలు చేస్తున్న గ్రామస్థులు
తాము నిర్మించుకున్న ఇంటి కింద శివాలయం ఉందని తెలియడంతో వెంటనే ఇంటిని ఖాళీ చేసిన ఎర్రమల pic.twitter.com/GpNDyf1w8X
— BIG TV Breaking News (@bigtvtelugu) March 28, 2025