బెలూన్ పేలి చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్రశోకంలో మునిగిపోయారు. పూర్తి వివరాల్లోకివెళితే.. ధులే నగరంలోని యశ్వంత్ నగర్లో డింపుల్ మనోహర్ వాంఖడే (8) అనే బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.
తన ఇంటి ఆవరణలో పిల్లలతో కలిసి బెలూన్ నోటితో ఊదుతుండగా ఒక్కసారిగా బెలూన్ పేలిపోయింది.పేలిన బెలూన్ ముక్కలు గొంతులో ఇరుక్కున్నాయి. దీంతో చిన్నారి డింపుల్ స్పృహతప్పి పడిపోయింది.వెంటనే తోటి పిల్లలు ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పగా.. వారు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు.బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. బెలూన్ ముక్కలు ఆమె శ్వాస నాళం వద్ద ఇరుక్కుపోవడంతో చిన్నారికి ఊపిరాడక మరణించిందని వైద్యులు నిర్దారించారు.