బడ్జెట్ 2020 లో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..!

-

కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్, లోక్ సభలో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆమె పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. ఇక ఎప్పట్లానే బడ్జెట్ అంటే కొన్ని వస్తువులపై ధరలు పెరగడం, కొన్నింటిపై తగ్గడం సహజం. ఈ బడ్జెట్ లో ధరలు పెరిగేవేవి, తగ్గేవేవి అన్న‌ది చూస్తే.. కమర్షియల్ వాహనాల స్పేర్ పార్టులు, సిగరెట్లు, వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు, టేబుల్ వేర్, చెప్పులు, స్కిమ్డ్ మిల్క్, సోయా ఫైబర్, సోయా ప్రొటీన్, కిచెన్ ఉపకరణాలు, వైద్య పరికరాలు, ఫర్నిచర్, పొగాకు ఉత్పత్తులు, రాగి, ఉక్కు, క్లే ఐరన్ బ‌డ్జెట్ ధ‌ర‌లో పెర‌గ‌నున్నాయి.

ఇక బ‌డ్జెట్ ధ‌ర‌లో త‌గ్గేవి చూస్తే.. ప్లాస్టిక్ ఆధారిత ముడిసరుకు, పలు రసాయ, కొన్నిరకాల మద్యం, వ్యవసాయాధారిత, జంతు సంబంధ ఉత్పత్తులు, ముడి పంచదార, వ్యవసాయాధారిత, జంతు సంబంధ ఉత్పత్తులు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్, మొబైల్ ఫోన్ల స్పేర్ పార్టులు,
ఎలక్ట్రిక్ వాహనాల ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news