ఆకట్టుకునే రంగుతో నిండుగా ఉంటుంది బొప్పాయి పండు. తియ్యటి రుచితో తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ప్రతిఒక్కరూ చాలా ఇష్టం గా తినే బొప్పాయి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది ఔషదం.తీయగా ఉన్నా ఇందులో కాలరీస్ చాలా తక్కువ. దీనిలో విటమిన్ సి ఎక్కువ ఉంది. ఇది మన శరీరంలో రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది.
బొప్పాయి లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. షుగర్ పేషెంట్లు కూడా ఈ పండును నిస్సంకోచంగా తినొచ్చు. డయాబెటిస్ వచ్చే అవకాశమున్న వారు ఈ పండును తింటే డయాబెటిస్ బారిన పడరు.బొప్పాయి లో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. చూపు మందగించకుండా కాపాడుతుంది. బొప్పాయిలో ఫైటో న్యూట్రియంట్స్, ఫ్లవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల డిఎన్ఎ ని రక్షిస్తాయి.
కాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. బొప్పాయి తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. యాంటి ఇన్ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది.బొప్పాయిలో ఉండే పపైన్ అనే డైజిస్టివ్ ఎంజైమ్ జీర్ణక్రియ సరిగా జరిగేట్టు చేస్తుంది. ఇందులో ఉన్న పీచుపదార్థాల వల్ల మనం తీసుకునే ఆహారం సులభంగా అరుగుతుంది.
బహిష్టు సమయంలో నొప్పితో బాధపడే మహిళలకు బొప్పాయి పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. బహిష్టు సమయంలో రక్తస్రావం సరిగా అయ్యేట్టు చేస్తుంది.బొప్పాయిలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ముడతలు పడకుండా ఆరోగ్యం గా ఉండటానికి సహాయ పడుతుంది.