వైరల్ వీడియో ;ఎలుకని చూసి భయపడిన పిల్లి

-

ఎలుక కనపడితే పిల్లి ఏం చేస్తుంది…? అసలు ఎలుక పిల్లి ని చూస్తే ఉంటుందా…? ప్రాణ భయంతో పరుగులు తీస్తుంది. పిల్లి వదులుతుందా…? కలుగులో దూరి అయినా సరే ఎలుక కోసం ఎదురు చూస్తుంది. దాన్ని ఎలాగైనా మీల్స్, డిన్నర్, బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ చేసుకోవాలని భావిస్తుంది. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే ఎలుక పిల్లిని తింటుంది. అన్ని చోట్లా జరిగేది ఇదే.

కాని ఒక పిల్లి ఎలుకని చూసి భయపడుతుంది. ఛీ కాదు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతుంది. ఏంటి నమ్మరా…? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయం మీకు స్పష్టంగా అర్ధమవుతుంది. ఒక పిల్లి ఎలుకకి భయపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక పిల్లి ఆహారం ఒక గిన్నెలో ఉంటే దాన్ని తింటూ ఉండగా వచ్చిన ఎలుక పిల్లిని బెదిరించి ఆహారం తింటుంది.

పిల్లి ఎం చేయలేక వెనుతిరిగి వెళ్ళిపోవడం వీడియోలో ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ఒక సంకేతం కూడా ఇస్తుంది. మనకి ఏదీ చేతగానప్పుడు మనకంటే బలహీనులు మన మీద పెత్తనం చేలాయిస్తారని, పోరాడే ధైర్యం లేనప్పుడు మనం చులకన అయిపోతామని, అసలు పోరాడాలి అనే విషయమే మర్చిపోతామని అంటూ పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news