డిపాజిట్ చేసిన వారికి ఆర్బిఐ గుడ్ న్యూస్…!

-

మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, రోజు వారీ కూలికి వెళ్ళే వారు… ఏ ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియక డబ్బుని దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా మందిని మనం ఇలాగే చూస్తూ ఉంటాం. భవిష్యత్తుకి భద్రత కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. తినీ తినక రూపాయి రూపాయి పోగు చేసుకుని తమ భవిష్యత్తు కోసం దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో ఈ విధానం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు మరింత ఎక్కువ భద్రత లభించనుంది. ఇటీవల పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకు డిపాజిట్లపై ఇప్పటి వరకు ఉన్న బీమా కవరేజీని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు.

ఈ నిర్ణయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నేపధ్యంలో ఫిబ్రవరి 4( మంగళవారం) నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఏదైనా కారణం చేతన బ్యాంకు మూతపడితే అందులో డిపాజిట్లపై గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుందని తెలిపింది. ఆర్బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) ఈ బీమా కవరేజీని అందించనుంది. డీఐసీజీసీలో బీమా పొందిన అన్ని బ్యాంకులకు ఇది వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంకు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news