ఈ మధ్య మహిళలపై వేధింపులు అనేవి క్రమంగా తీవ్రమవుతున్నాయి. సిని నటులను కూడా వేధిస్తున్నారు. ఫేం ఉన్న వాళ్లకు కూడా సోషల్ మీడియాలో వేధింపులు తప్పడం లేదు అనేది వాస్తవం. ఎందరో సిని నటులను సోషల్ మీడియాలో అనేక రకాలుగా అభిమానుల రూపంలో ఉన్న కొందరు వేధిస్తున్న సంగతి తెలిసిందే. యాంకర్లను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను వేధిస్తూ వస్తున్నారు.
తాజాగా ఈ వేధింపులు జబర్దస్త్ యాంకర్ అనసూయకి మొదలయ్యాయి. ఆమెను సోషల్ మీడియా వేదికగా పలువురు ఆమెను వేధిస్తున్నారు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపధ్యంలోనే అనసూయ పోలీసులను ఆశ్రయించింది. తనపై చేస్తున్న కామెంట్స్ ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసింది.
ఆమె చేసిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్స్ పీఎస్ హైదరాబాద్ సిటీ పోలీస్ వారు స్పందించారు. అనసూయ భరద్వాజ్ తన ట్వీట్ లో శృతి మించుతూ చేస్తున్న అసభ్య వ్యాఖ్యలకు స్పందించకపోతే ఇక సహనానికి అర్థం ఉండదని పేర్కొన్నారు. అంతేకాదు తనపై చేసిన వ్యాఖ్యలకు తానేమి సిగ్గుపడటం లేదని, సరియైన వ్యవస్థలు చర్య తీసుకోవాలని కోరింది. సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించడంపై ఆమె ధన్యవాదాలు చెప్పింది.