భార్యతో కలిసి అనంత్ అంబానీ పాదయాత్ర…!

-

భార్యతో కలిసి అనంత్ అంబానీ పాదయాత్ర చేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ జామ్‌నగర్ నుంచి ద్వారకాధీష్ ఆలయం వరకు చేపట్టిన ‘పాదయాత్ర’ కొనసాగుతోంది. ఇది తన మతపరమైన యాత్ర అని చెప్పారు. భగవాన్ ద్వారకాధీష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ

ananth ambani, reliance

యాత్రలో తనతో కలిసి నడిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటు, అనంత్ పాదయాత్రలో అతని భార్య రాధిక కూడా చేరింది. త్వరలోనే తల్లి నీతు అంబానీ కూడా ఈ పాదయాత్రలో జాయిన్ కానున్నారు.

అనంత్ నిత్యం 20 కిలోమీటర్లు నడుస్తున్నట్లు తెలుస్తోంది. తన వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడొద్దనే ఉద్దేశంతో భారీ సెక్యూరిటీ మధ్య రాత్రివేళ నడక సాగిస్తున్నారు. ఏప్రిల్ 10న తన పుట్టినరోజు నాటికి ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news