ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గెలవడం జరిగింది. ఢిల్లీ ఎన్నికలలో ఇప్పటి దాకా మూడు సార్లు గెలిచి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించారు కేజ్రీవాల్. పట్టుకుంటే భరితంగా జరిగిన ఎన్నికలలో బిజెపి పార్టీ తో పోరాడి గెలిచిన కేజ్రీవాల్ కి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు అభినందనలు తెలిపారు. అయితే ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా బిజెపి తీసుకుని ఓడిపోవడంతో బీజేపీ క్యాడర్ మొత్తం తీవ్ర నిరుత్సాహం చెందింది.
ఈ ఎన్నికలలో కేజ్రీవాల్ ని ఓడించడం కోసం దాదాపు 200 మంది బీజేపీ ఎంపీలను రంగంలోకి దించారు. అయినా కానీ బిజెపి పార్టీ ఓటమి చెందడంతో దేశవ్యాప్తంగా బిజెపి పార్టీకి ఆంటీ గా ఉన్న పార్టీలు ఈ ఓటమిని ఫుల్ ఎంజాయ్ చేశాయి. ప్రధాని మోడీ మరియు హోంమంత్రి అమిత్ షా ఇంకా కొంత మంది కేంద్ర మంత్రులు అదే విధంగా 11 మంది బీజేపీ పార్టీ ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఎన్నికల క్యాంపెయిన్ చేసిన బిజెపి పార్టీ ఓటమి చెందటం ఆ పార్టీ పెద్దలకు పార్టీ క్యాడర్ కి కేజ్రీవాల్ గెలుపు మింగుడు పడటం లేదు.
ఇటువంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడంతో కేజ్రీవాల్ కి సోషల్ మీడియాలో అభినందనలు చెప్పటం జరిగింది. దీంతో పవన్ పేరు చెబితేనే బిజెపి నేతలు మండిపడుతున్నారు. బిజెపి పార్టీ ని ఓడించిన ఆమ్ ఆద్మీకి శుభాకాంక్షలు చెప్పే ఇక్కడ చంద్రబాబు గురించి రెండు వేల కోట్ల ప్రస్తావనలో బాబు ని ప్రశ్నించే హక్కు మనకు లేదు అన్నట్టు పవన్ కళ్యాణ్ వ్యవహరించడం పట్ల ఫుల్ సీరియస్ గా ఉన్నారట బీజేపీ పార్టీ నేతలు. అనవసరంగా పవన్ కళ్యాణ్ నీ బీజేపీలో చేర్చుకునామని బాధ పడుతున్నారట.