టిక్ టాక్ దెబ్బకు విడాకులు ఇచ్చాడు…!

-

టిక్ టాక్ పుణ్యమా అని భార్యా భర్తల మధ్య వివాదాలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు కొందరు. టిక్ టాక్ కి అలవాటు పడి కొందరు మహిళల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతుంది. కుటుంబాలను కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా తన భార్య టిక్ టాక్ పిచ్చి తట్టుకోలేక భర్త విడాకులు ఇవ్వడం సంచలనంగా మారింది.

తమిళనాడు లోని వేలూరు రాష్ట్రంలో టిక్ టాక్ ద్వారా పరిచయమైనా వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక భార్య. 30 ఏళ్ళ మహిళకు కొన్నాళ్ళ క్రితం పెళ్లి కాగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది ఆమె. టిక్ టాక్ కి క్రమంగా అలవాటు పడిన ఆమె ఈ మధ్య దాని పిచ్చిని మరింతగా పెంచుకుంది. టిక్‌ టాక్‌లో కవితలు చెప్పడం, డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడడం లాంటివి చేస్తూ ఆ వీడియోలను వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపుతూ ఉండేది.

ఈ క్రమంలో వేలూరులో పని చేస్తున్న 32 ఏళ్ళ వ్యక్తి ఆమె వీడియోలు నచ్చి కామెంట్లు పెట్టడం లైక్స్ కొట్టడం చేయడంతో ఒకరికి ఒకరు ఫోన్ నెంబర్ లు ఇచ్చుకునే వరకు వెళ్ళింది. అప్పటి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారింది. అక్రమ సంబంధ౦ పెట్టుకున్నారు. మరో వ్యక్తితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని గుర్తించిన భర్త పలు మార్లు మంధలించినా ఆమె వినలేదు. వేలూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనికి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ య్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news