కృష్ణా జిల్లా మైలవరం మండలం వేల్వడం గ్రామంలో ప్రభల గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో కృష్ణా జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. అయితే ఆ ఉత్సవంలో డప్పులకు కొంత మంది నాయకులు, కార్యకర్తలు స్టెప్పులేయగా ఇది చూసిన ఎమ్మెల్యే వారి డ్యాన్సుకు చప్పట్లు కొడుతూ తాను కూడా వారితో కలిసి కాసేపు స్టెప్పులేశాడు.
ఎన్నారై లక్కిరెడ్డి జయప్రకాశ్‌రెడ్డితో కలిసి కృష్ణప్రసాద్ స్టెప్పులతో అదరగొట్టారు. అయితే ఎప్పుడు రాజకీయాల గురించే మాట్లాడే నాయకులు ఇలా స్టెప్పులేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే శివరాత్రి పర్వదినం సందర్భంగా యార్లగడ్డ గ్రాండర్ నుంచి ప్రభ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.