అమ్మా జర జాగ్రత్త.. చీర కట్టుకుని బండి ఎక్కుతున్నారా…?

-

ప్రమాదంతో సావాసం చేస్తున్నాం మనం.. ఎప్పుడు ఏవైపునుండి వస్తుందో తెలియని పరిస్థితి.. ఏ రూపంలో వస్తుందో… ఎటు నుంచి ముంచుకు వస్తుందో అంచనా కూడా వేయలేని పరిస్థితి. అపాయాన్ని ఎవరూ అంచనా వేయలేరు అనుకోండి. ప్రమాద౦ ఊహించలేకుండా వస్తుంది. మెట్రో పిల్లర్ కింద ఉండి చనిపోవడం, ఫ్లై ఓవర్ కింద నిలబడితే పై నుంచి కారు పడిపోవడం, సేల్ఫీ దిగుతుంటే లారీ వచ్చి గుద్దడం… ఇలా ఎన్నో రకాలుగా ప్రమాదం మన దగ్గరకు వస్తుంది.

కాబట్టి మనం తీసుకునే జాగ్రత్తల్లో మనం ఉంటే మంచిది. బండి చక్రంలో చీర కొంగు పడి మరణిస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. చీర కొంగు ని వదిలేయడంతో వేగంగా వెళ్ళే బండిలో అది చిక్కుకోవడం, వెనక్కు లాగేయడంతో రోడ్డు మీద పడిపోతున్నారు. దీనితో తలకు బలమైన గాయాలు అయి మరణించడం, బండి ఈడ్చుకుపోయి తీవ్ర గాయాలు అవడం వంటివి చూస్తున్నాం.

ఇక ఆడ పిల్లలు కూడా తమ చున్నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బండి మీద వెళ్తున్నారు అంటే కచ్చితంగా వెనక్కో ముందుకో ముడి వేసుకోవడం మంచిది. ఆడవాళ్ళు కూడా అలాగే చెయ్యాలి. బండి మీద వెళ్తున్నారు అంటే ముందే కొంగు ని మడిచి పట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి బండి ఎక్కుతున్నప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news