ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడని… సెటైర్లు పేల్చారు కల్వకుంట్ల కవిత. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని ఆమె వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత… పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించడమేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారని చురకలాంటించారు. చేగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి అప్పుడు రైటిస్ట్ ఎలా అయ్యారు అంటూ ఆగ్రహించారు. ఆయన చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధం గా ఉంటాయని మండి పడ్డారు. రేపు తమిళనాడు వెళ్లి హిందీ చేయబోమనైన ఆయన చెప్పవచ్చు అంటూ ఎద్దేవా చేశారు కల్వకుంట్ల కవిత.
వామ పక్షాలతో పొత్తులో ఉంటే ఆయన కరుడు గట్టిన కమ్యూనిస్టు
బీజేపీతో పొత్తులో కరుడు గట్టిన హిందుత్వ వాది
– డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణా మహిళా నేత కవిత #PawanKalyan #Kavitha #Telangana #UANow pic.twitter.com/0UyAFy68Wt
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 10, 2025