తెలంగాణ ముఖ్యమంత్రిగా నా బ్రాండ్ అదే.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ముఖ్యమంత్రులకు ఒక బ్రాండ్ ఉందని.. తనకు ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌’ బ్రాండ్ గా మారబోతుందని సీఎం రేవంత్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కిలో బియ్యం రూ.2కే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌, ఐటీని అధివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు, ఆరోగ్య శ్రీ తెచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌లది అయితే.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ అనగానే అందరికీ తానే గుర్తొస్తానని చెప్పారు. ‘ఇదే నా బ్రాండ్’ అని సీఎం రేవంత్ స్పష్టంచేశారు.మరికొందరు తెలంగాణ ఉద్యమాన్ని తమ బ్రాండ్‌గా చెప్పుకొని పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news