రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే మర్చిపోయాడు. గురువారం నాంపల్లిలోని గాంధీభవన్‌లో సొంత పార్టీ ఎమ్మెల్యే మందు సామేల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి బదులుగా సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అని సంబోధించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క నడుచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలాఉండగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని సొంత పార్టీ ఎమ్మెల్యేలకే గుర్తుకు లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. గతంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం సీఎం పేరును మర్చిపోయిన విషయం తెలిసిందే.
రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ https://t.co/fCMp8JRAg9 pic.twitter.com/JuHUTWwbcc
— Telugu Scribe (@TeluguScribe) April 10, 2025