నయీం కేసులో దూకుడు పెంచింది ఈడీ. నయీంకు సంబంధించి 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు తీసుకోనుంది. 35 ఆస్తులను నయీం కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించింది ఈడీ. అక్రమంగా ఈ ఆస్తులను నయీం, తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు ఈడీ గుర్తించారు.

2022 మార్చిలో నయీం ఆస్తుల పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. నాటి ఐటీ అధికారులు, సిట్ సమాచారంతో ECIR నమోదు చేసింది. ECIR లో నయీం కుటుంబసభ్యుల పేర్లను చేర్చింది ఈడీ. నయీం పై ఫిర్యాదు చేశారు భువనగిరిలోని క్రిస్టియన్ గోస్పెల్ మిషన్ సెక్రటరీ ప్రభాకర్. రూ. కోట్ల ఆస్తులు సంపాదించినా ITR ఫైల్ చేయలేదు నయీం కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే నయీంకు సంబంధించి 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు తీసుకోనుంది.