ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు తీవ్రత కి షెడ్లు కుప్ప కూలిపోయాయి. గోడలు బద్దలయ్యాయి. రేకులు ముక్కముక్కలుగా విరిగి చెల్లా చెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించడంతో కూలీలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఓ మందు సామాగ్రి కోసం గుండు కక్కుతుండా ఒత్తిడి ఎక్కువై పేలుడు సంభించినట్టు సమాచారం. మరోవైపు పేలుడు సమయంలో తమ ఇళ్లు కంపించినట్టు స్థానికులు పేర్కొనడం గమనార్హం.
అనకాపల్లి జిల్లా లోని కైలాసపట్నం అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.15లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ఏపీ హోంమంత్రి అనిత ప్రకటించారు. ఎంపీ సీఎం రమేష్ తో కలిసి ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాణా సంచా తయారీ కేంద్రం వద్ద జరిగిన ప్రమాదంలో క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.