అది నిరుద్యోగ భృతికాదు, పెన్ష‌న్‌: ర‌ఘువీరా

-


అమ‌రావ‌తి(పశ్చిమ గోదావరి): యువ‌నేస్తం పేరుతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్ర‌భుత్వం ఇస్తున్న‌ది భృతికాద‌ని, పెన్ష‌న్ అని ఏపిసిసి ఛీఫ్ ఎన్.ర‌ఘువీరారెడ్డి విమ‌ర్శించారు. నెల‌కు 2 వేలు ఇస్తామ‌ని మ్యానిఫెస్టోలో చెప్పి… నాలుగున్న‌ర సంవ‌త్స‌రం కాల‌క్షేపం చేసి.. ఎన్నిక‌ల‌కు ముందు ఇవ్వ‌డం చంద్ర‌బాబు జిమ్మిక్కుల్లో భాగ‌మేనన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలోని కాళ్లకూరు గ్రామంలో చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్‌ కార్యక్రమంలో రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, గాదిరాజు లచ్చిరాజు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news