త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల : మంత్రి దామోదర

-

తెలంగాణ ప్రభుత్వం రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నదని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని..ఎస్సీ వర్గీకరణ, కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలే ఇందుకు ఉదాహరణలన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు.

ఆయన జయంతి సందర్భంగా దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కల సంపూర్ణంగా నెరవేరుతుండటం మరింత సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. రాబోయే నెలరోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగాల సాధనకు యువత సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news