ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, వడ్డీలపై 16వ ఆర్థిక సంఘానికి వివరణ ఇచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అమరావతి రాజధాని పై స్పెషల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చిన నష్టం.. కేంద్ర సాయం పై ప్రధానంగా సీఎం చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం ఉన్న స్తితిలో ఏపీని ఆర్థికంగా ఆదుకోవాల్సిన పరిస్థితి పై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి.. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలకు సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు సిఫార్సు చేయాల్సిందిగా కోరారు.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న సాయంతో కొంత ముందుకు వెల్తున్నా.. గతంలో చేసిన అప్పులు వాటికి అవుతున్న వడ్డీలతో ప్రగతి రథం ముందుకు కదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం అధికారులకు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు.