ప్రైమరీస్ లో బిడెన్ విజయం..ఊపందుకున్న ఎన్నికల ప్రక్రియ

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్నపోరులో అయోవా, న్యూహాంప్‌షైర్‌, నెవడాలో వరుసగా ఓటమి పాలైన జోయ్ బిడెన్‌ శనివారం నాటి సౌత్‌ కరోలినా ప్రైమరీస్‌లో విజయం సాధించినట్లు తెలుస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మరింత ఊపందుకోవడం తో పాటు సూపర్‌ ట్యూజ్‌డే (14 రాష్ట్రాల్లో ఒకే రోజు) ప్రైమరీస్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం నాటి గెలుపుతో అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వ రేసులో బిడెన్‌ ఆశలు సజీవంగా నిలిచాయి. సౌత్‌ కరోలినాలో ఓటింగ్‌ ప్రారంభమైనప్పటి నుండే బిడెన్‌ టాప్‌ ఫేవరేట్లలో ఒకడిగా నిలిచిన విషయం తెలిసిందే. గత మూడు ప్రైమరీలలో ఆయన నాలుగో స్థానానికి పరిమితమవ్వడం తో కొంత అనుమానాలు వ్యక్తం అయ్యాయి కానీ ఈ ప్రైమరీలో బిడెన్‌ 48.4 శాతం ఓట్లు సాధించి అగ్ర స్థానంలో నిలవడం విశేషం. వెర్మాంట్‌ సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌కు కూడా ఈ ప్రైమరీ లో 19.9 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బిడెన్‌ విజయానికి ఎక్కువగా ఆఫ్రికన్‌ అమెరికన్‌ ఓటర్లు, 45 ఏళ్ల పైబడిన అమెరికన్‌ ఓటర్ల ఓటింగ్‌ దోహదపడినట్లు తెలుస్తోంది.

అయితే ప్రైమరీ లో బిడెన్ విజయం సాధించడం తో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మరింత ఊపందుకుంది. దాదాపు 52 లక్షల మంది జనాభా వున్న సౌత్‌ కరోలినా రాష్ట్రం డెమొక్రాట్స్‌ అభ్యర్థి ఎంపికలో తొలి దక్షిణాది రాష్ట్రంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడి జనాభాలో 30 శాతం మంది నల్ల జాతీయులు కాగా, డెమొక్రాటిక్‌ పార్టీ సంప్రదాయక ఓటర్లు 60 శాతం పైగానే వున్నారు. సూపర్‌ ట్యూస్‌డే ముందు జరిగిన చివరి ప్రైమరీ కావటంతో సౌత్‌ కరోలినా కీలకంగా మారింది. సూపర్‌ ట్యూస్‌డేలో 14 రాష్ట్రాలలో ఒకేసారి ప్రైమరీలు జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఈ ప్రైమరీ లో గెలుపును బట్టి ట్రంప్‌ ప్రధాన ప్రత్యర్థి ఎవరన్న విషయం తేలిపోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news