విశాఖలో వైసీపీకి షాక్ తగిలింది. అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక రాజీనామా చేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె, ఆరో వార్డు కార్పొరేటర్ ప్రియాంక వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు లేఖ పంపారు.

అవిశ్వాస తీర్మానం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇక తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె, ఆరో వార్డు కార్పొరేటర్ ప్రియాంక వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. కాగా వైఎస్ఆర్సిపి ముఖ్య నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైయస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు.