రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. గురవారమే రోజునే విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన అనివార్య కారణాల వల్ల గైర్హాజరయ్యారు. పలు కారణాల వల్ల గురువారం రాలేకపోతున్నానని, శుక్రవారం విచారణకు హాజరవుతానంటూ సిట్‌కు సమాచారం అందించారు. చెప్పినట్లుగానే ఈరోజు మధ్యాహ్నం ఆయన సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
లిక్కర్ స్కామ్ కేసులో సాక్షిగా ఉన్న విజయ సాయిరెడ్డికి ఈనెల 15వ తేదీన సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 18వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే మొదట విజయసాయిరెడ్డి తాను 17వ తేదీనే విచారణకు వస్తానని సిట్ అధికారులకు తొలుత సమాచారం అందించారు. కానీ గైర్హాజరయ్యారు. అనివార్య కారణాల వల్ల విచారణకు రాలేకపోయానని అధికారులకు సమాచారం అందించిన ఆయన శుక్రవారం వస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే ఇవాళ సిట్ ఎదుటకు వచ్చారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డేనని దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తానని విజయసాయిరెడ్డి ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.