నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో స్వల్ప ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రైతులు,పోలీసులకు గాయాలైనట్లు సమాచారం. రైతు మహోత్సవ సభ ప్రాంగణం పక్కనే హెలికాప్టర్ ల్యాండింగ్ కావడంతో వాటి రెక్కల గాలి స్పీడుకు టెంట్లు కూలిపోయాయి.
గాలి దుమారం కారణంగా స్వాగత తోరణం ఒక్కసారిగా కూలిపోయింది. సభా ప్రాంగణం కూలడంతో రైతులకు, బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. హెలికాప్టర్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ రైతు మహోత్సవ సభకు వచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే సభా ప్రాంగణం నుండి రైతులు పరుగులు పెట్టారు.దీంతో అక్కడ స్వల్ప తొక్కిసలాట జరిగడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో స్వల్ప ప్రమాదం.. రైతులకు, పోలీసులకు గాయాలు
రైతు మహోత్సవ సభ ప్రాంగణం పక్కనే హెలికాప్టర్ ల్యాండింగ్ కావడంతో కూలిన టెంట్లు
గాలి దుమారంతో కూలిన స్వాగత తోరణం
సభా ప్రాంగణం కూలడంతో రైతులకు, బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు స్వల్ప గాయాలు
హెలికాప్టర్ లో… pic.twitter.com/IKu2dIh41C
— TNews Telugu (@TNewsTelugu) April 21, 2025