మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఇంటర్ విద్యార్థి మృతి

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల వాడకం, సరఫరాపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తూ ఎక్కడికక్కడ సరఫరాదారులను పట్టుకుంటోంది. అయితే రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగిస్తున్న, సరఫరా చేస్తున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారని ఇటీవల గణాంకాలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఘటన ఇందుకు మరో ఉదాహరణగా నిలిచింది.

హైదరాబాద్‌లో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. బాలానగర్‌లో ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకున్నారు. ఇంజెక్షన్ తో పాటు ట్యాబ్లెట్లు కూడా ఒకేసారి తీసుకున్నారు. దీంతో డోస్ ఎక్కువైంది. ఈ క్రమంలో ఓ అబ్దుల్ నాసర్ అనే విద్యార్థి మృతి చెందాడు.  మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news