ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు రిలీజ్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దింతో ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలపై ఉత్కంఠత వీడింది. ఈనెల 23వ తేదీన అంటే.. బుధవారం ఉదయం 10 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల కాబోతున్నాయి.

ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ అయింది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6.19 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ ఫలితాలను పదో తరగతి అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. హాల్ టికెట్ టైప్ చేసి వెబ్సైట్లో ఎక్కడైనా ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు ప్రకటన చేశారు.