టీడీపీ నేత హత్య.. చంద్రబాబు నాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఒంగోలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి మృతదేహానికి నివాళులర్పించనున్నారు చంద్రబాబు నాయుడు.

ఇక అటు టీడీపీ నేత దారుణ హత్య నేపథ్యంలో… నారా లోకేష్ సీరియస్ అయ్యారు. సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్య వార్త నన్ను షాక్ కు గురి చేసిందన్నారు లోకేష్. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం అన్నారు. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారని తెలిపారు.