గుంటూరు రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని కి ఊహించని షాక్ తగిలింది. వైసీపీ నేత విడదల రజిని మరిది అరెస్ట్ అయ్యాడు. ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి ఉన్నాడు. వైసీపీ నేత విడదల రజిని మరిది గోపిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు..

స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ… ఇవాళ మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని అరెస్ట్ చేశారు. అటు ఇప్పటికే మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినికి ఏసీబీ షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్‌క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై రజినిపై ఏసీబీ కేసు నమోదైంది.