BRS సభ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

BRS సభ పై ఖైరతాబాద్  ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ ద్వారా స్పందించారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్ లో తప్పు ఏమి లేదని.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. ఆమె రీ ట్వీట్ మాత్రమే చేశారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్టు లేదన్నారు. మరోవైపు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా జనం వస్తారని భావిస్తున్నట్టు తెలిపారు.

కేసీఆర్ ను చూసేందుకు జనం ఎక్కువగా వస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున విజయం సాధించిన ఈయన కాంగ్రెస్ చేరి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ తరువాత ఓడిపోవడంతో మెల్లగా బీఆర్ఎస్ కి పాజిటివ్ గా మాట్లాడుతున్నాడని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news