ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష తేదీని స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB) ప్రకటించింది. ప్రకటన ప్రకారం, ఈ పరీక్ష జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. పరీక్షా కేంద్రాలను వైజాగ్, కాకినాడ, గుంటూరు, కర్నూల్, తిరుపతి నగరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు SLPRB తెలిపింది.

మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 95,208 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఫిజికల్ టెస్టుల్లో 38,910 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. తుది పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు, ఇతర వివరాల కోసం SLPRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను త్వరలో అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం.