నేడు పోప్ అంత్యక్రియలు జరుగనున్నాయి. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఇవాళ పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహ ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు 164 మంది హాజరుకానున్నారు.

దేశాధినేతలు వస్తుండటంతో ఇటలీ ప్రభుత్వం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21 పోప్ ఫ్రాన్సిస్ అనార్యోగంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.