ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు తాజాగా విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్తులు అలాగే గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేసింది కేంద్ర సర్కార్.

ఇందులో భాగంగానే 1121.20 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది కేంద్ర సర్కార్. 2024 నుంచి 2025 సంవత్సరానికి గాను రెండో విడుదగా కేంద్రం నుంచి ఈ నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇప్పటికే అమరావతి కోసం ప్రత్యేక నిధులు వస్తున్నాయి. ప్రతినెల అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తోంది మోడీ సర్కార్. అలాగే త్వరలోనే ఏపీలో మెట్రో ప్రాజెక్టును విస్తరణ చేయబోతోంది. ఇలా అన్ని విధాల మోడీ సర్కార్.. ఏపీకి సహాయపడుతోంది.