పాక్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలుంటాయి – బండి సంజయ్

-

ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలుండబోతున్నాయని అన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని, ఇందుకు యావత్ దేశం అండగా నిలవాలని కోరారు.

ఈరోజు హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివ్రుద్ది కేంద్రంలో నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు జీఎస్టీ చీఫ్ కమిషనర్లు సందీప్ ప్రకాశ్, వి.సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి అత్యంత ఇష్టమైన కార్యక్రమం ‘‘రోజ్ గార్ మేళా’’. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్న నాయకుడు మోదీ. 2022 అక్టోబర్ 22న ‘ప్రారంభమైన రోజ్ గార్ మేళా’ నేటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 రోజ్ గార్ మేళాలను నిర్వహించి 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news