సాఫ్ట్వేర్ ఇంజినీర్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని రెడ్ హ్యాండెడ్గా కట్టుకున్న భార్యకు పట్టుబడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శివకు నాలుగేళ్ల కిందట దీప్తి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పాప ఉన్నది.
ఈ క్రమంలోనే గత కొంతకాలంగా దీప్తికి దూరంగా ఉంటున్న శివ..సుష్మ అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దీప్తి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సుష్మతో కూకట్పల్లిలో నివాసం ఉంటున్నాడని తన భర్త వద్దకు వెళ్లింది.బంధువులతో కలిసి వెళ్లి తన భర్త శివను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఒకే గదిలో తన భర్త శివ, సుష్మను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.