ఇవాళ గులాబీ పార్టీ 25వ వార్షికోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో రజతోత్సవం పేరుతో.. భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. ఇందులో భాగంగానే… ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బయటకు రాని కెసిఆర్ కూడా… ఈ సభతో రంగంలోకి దిగబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యారు కెసిఆర్.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాదిన్నర అయిపోయిన నేపథ్యంలో.. కథన రంగంలోకి కేసీఆర్ దిగబోతున్నారు. ఇకపై కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేయబోతున్నారు. దీనికోసం ఈ సభను వేదిక చేసుకోబోతున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటలపాటు కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.
హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ప్రాంతంలో దాదాపు 1200 ఎకరాలలో కెసిఆర్ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు పది లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేస్తున్నారు. 3000 ఆర్టీసీ బస్సులను కూడా.. ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి సభ ప్రారంభం అవుతుంది. కెసిఆర్ ప్రసంగం 6 గంటలకు ఉండే ఛాన్స్ ఉంది.