బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. హెలికాప్టర్ లో సంతోష్, దేశపతి శ్రీనివాస్ తో కలిసి వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు కేసీఆర్. బీఆర్ఎస్ బలం, బలగాన్ని దేశమంతా చూపించాలని నిర్ణయించారు. ఈ తరుణంలోనే 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు.
ఐదు ఎకరాల్లో ప్రధాన వేదికను పెట్టారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునే విధంగా తయారు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాల్లో విశాలమైన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది. జనం కోసం 10లక్షల వాటర్ బాటిళ్లు.. 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. వివిధ రూట్లలో ఆరు అంబులెన్స్ లు, పరిసరాల్లో 12 వైద్య శిబిరాలను సైతం ఏర్పాటు చేశారు. 1200 తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. అలాగే పార్కింగ్ నిర్వహణకు 2500 మంది వాలంటీర్లను నియమించారు.