జుట్లు పట్టుకొని కొట్టుకోవడానికే ఉచిత బస్సు పథకం పని కొస్తుంది తప్ప ఎవ్వరికీ ప్రయోజనం లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పడంలో కాంగ్రెస్ ని మించింది లేదన్నారు. ఆడబిడ్డలకు స్కూటీలు, రైతుబంధు రూ.15వేలు, తులం బంగారం, తదితర 420 హామీలు నెరవేర్చరా..? అని ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడు ఇక్కడున్నవాళ్లు చాలరన్నట్టు ఢిల్లీ నుంచి నకిలీ గాంధీలు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపామని కేసీఆర్ తెలిపారు. ఆ సమయంలో అద్భుతమైన తెలంగాణను నిర్మించుకున్నట్టు చెప్పారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని రైతుబంధు తీసుకొచ్చామని అన్నదాతలు చనిపోతే బీమా ఇచ్చి కుటుంబాన్ని ఆదుకున్నామని తెలిపారు. పంజాబ్ ను తలదన్నెలా రాష్ట్రంలో వ్యవసాయాన్ని నెంబర్ వన్ చేసినట్టు వివరించారు. 28 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు చెప్పారు.