2025-26లో ఏం చేద్దాం.. మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క రివ్యూ

-

రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నేడు తన శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 2025-26 సంవత్సరానికి గాను యాక్షన్ ప్లాన్‌పై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి మహిళ అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభారాణి, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, టీజీ ఫుడ్స్ చైర్మన్ M.A పహీం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ హాజరయ్యారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరు, నిధుల కేటాయింపు, మహిళా, శిశు సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలు, ప్రభుత్వం అమలు చేయాల్సిన పెండింగ్ పనులపై సంబంధిత మంత్రి అధికారులతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news