ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్‌లో తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే అయ్యాక మనోడు.. మందోడు అని ఉండదన్నారు. సీఎల్పీ సమావేశంలో అందర్ని అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనుకపడ్డామన్నారు. ఆప్షన్ లేకే కొందరు అధికారులను కొనసాగిస్తున్నామని చెప్పారు.అధికారం పోయింది అనే బాధతో మాట్లాడినట్టు ఉంది కేసీఆర్ స్పీచ్ అని… కేసీఆర్ స్పీచ్ లో పస లేదని చురకలు అంటించారు. ఈ ప్రపంచంలో ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్, మోడీ ఇద్దరూ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారని వెల్లడించారు. నాకు, రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.