ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ వ్యక్తి తల్లి,అక్కకు చిత్రహింసలు పెడుతున్నాడు. అడ్డుకోబోయిన తండ్రిని సైతం తీవ్రంగా దాడికి పాల్పడినట్లు సమాచారం. సదరు వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడిగా గుర్తించారు.
ఆస్తి కోసం తల్లి, అక్కను చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు పచ్చి బూతులు తిట్టి దాడులక పాల్పడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలను వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోలను వాట్సాప్లో పంపినా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పందించలేదని తెలుస్తోంది.
దీంతో చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఆస్తి కోసం తల్లి, అక్కను చిత్రహింసలు పెడుతున్న చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు
చిలకలూరిపేటలో ఆస్తి కోసం తల్లి, అక్కను పచ్చి బూతులు తిట్టి, దాడి చేసిన ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు
దాడి వీడియోలు వాట్సాప్లో పంపినా స్పందించని ఎమ్మెల్యే… pic.twitter.com/f3GRVNEjeB
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2025