సహజంగా వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను పాటించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే ఈ పనులను చేయకుండా ఉంటే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. స్నానం చేయడం కేవలం శుభ్రంగా ఉండడానికి మాత్రమే కాకుండా సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడైతే స్నానం చేస్తారో శరీరం, మనసు, శుద్ధి అవ్వడంతో పాటుగా శరీరంలో ఉండే ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది. అందువల్ల శుభకార్యం లేదా పూజలు వంటివి చేసే ముందు స్నానం చేసి ప్రారంభించాలని చెబుతారు.
అంతేకాకుండా ఎప్పుడైతే స్నానం చేసి కొన్ని పనులు చేస్తారో ఎంతో ప్రమాదం ఉంది. స్నానం చేసిన తర్వాత ఈ పనులను చేయడం వలన రాహు, కేతువుల పై చెడు దృష్టి, భయం ఉంటుంది. పైగా ఎప్పుడైతే స్నానం చేసి ఈ పనులు చేస్తారో దురదృష్టం పెరిగిపోతుంది మరియు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. స్నానం చేసిన వెంటనే రాలిపోయిన జుట్టుని బాత్రూంలో అస్సలు ఉంచకూడదు. ఎప్పుడైతే ఇలా ఉంచుతారో అది ఒక అశుభ్రమైన పనిగా భావిస్తారు. అంతేకాకుండా ఇలా చేయడం వలన శని దేవుడికి కోపం కూడా వస్తుంది. దీంతో పనులు పూర్తి అవ్వవు మరియు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. స్నానం చేసిన వెంటనే బాత్రూం నుండి బయటకు వచ్చిన తర్వాత నీటిలో ఉండే నీరుని అలా వదలకూడదు. ఇలా వదలడం వలన ఇంటి వాస్తు పై ప్రభావం పడుతుంది.
పైగా రాహువు, కేతువులు చాలా బలహీనంగా మారుతారు. ఈ విధంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. దీంతో పేదరికాన్నీ, దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది చెప్పులు వేసుకుని స్నానాన్ని చేస్తారు. ఇలా చేయడం వలన రాహు, కేతువులకు హాని కలుగుతుంది. కనుక చెప్పులు తీసి స్నానం చేయాలి. కొంతమంది స్నానం చేసిన తర్వాత మురికి బట్టలను శుభ్రం చేస్తూ ఉంటారు. అలా కాకుండా స్నానం చేసే ముందు బట్టలను ఉతికి, తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. ఇటువంటి పనులను చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది మరియు ఎంతో ఆనందంగా జీవించవచ్చు.