ఇంట్లో కాళ్ళ జెర్రిలు ఎక్కువ అవుతున్నట్లైతే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే..!

-

ఎన్నో కారణాల వలన ఇంట్లో కీటకాలు వాస్తు ఉంటాయి. అయితే వాటి బెడద ఎక్కువగా ఉంటే తగిన చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం వలన ఎటువంటి ప్రమాదం ఉండదు. ముఖ్యంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వలన ఇంట్లో కీటకాలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో కాళ్ళ జెర్రి కూడా ఒకటి. ఇవి బయట వేడి నుండి కాపాడుకోవడానికి ఇంట్లోకి వస్తాయి. సహజంగా ఇవి బాత్రూమ్ నుండి లేక వంట గదిలో ఉండే సింక్ నుండి వస్తాయి. ఇవి ఎంతో ప్రమాదకరం కాకపోయినా కొన్ని విషంతో నిండి ఉంటాయి.

కాకపోతే కాళ్ళ జెర్రి కుట్టడం వలన తీవ్రమైన సమస్య ఉండదు. ఇవి కుడితే ఇన్ఫెక్షన్లు, నొప్పి, మంట వంటి లక్షణాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారో ఈ కాళ్ళ జెర్రి వంటివి కుట్టకుండా చూసుకోవాలి. చిన్న పిల్లలకు ఇవి కుడితే చాలా ప్రమాదకరం. అందుకే కొన్ని చిట్కాలను పాటించి వీటిని ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. కాళ్ళ జెర్రీలు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవడానికి వైట్ వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వెనిగర్‌తో పాటు డెట్టాల్‌ను కలిపి, ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో వేసి దీనిని సింక్ లేక డ్రెయిన్‌ దగ్గర స్ప్రే చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని బాత్రూమ్‌తో పాటు ఇంటిని కూడా తుడవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇలా చేస్తే కాళ్ళ జెర్రిలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

ఇంట్లో కాళ్ళ జెర్రిలు లేకుండా ఉండాలంటే వేప నూనె కూడా ఎంతో సహాయం చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొంచం వేప నూనెను కలిపి స్ప్రే బాటిల్‌లో వేసి స్ప్రే చెయ్యాలి. వేప నూనె లో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు పురుగు మందుగా పనిచేస్తుంది. అంతేకాకుండా వేప నూనెను ఇల్లును తుడవడానికి కూడా ఉపయోగించవచ్చు మరియు ఇలా చేయడం వలన కాళ్ళ జెర్రిలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అదేవిధంగా సున్నం కలిపిన నీటిని కూడా స్ప్రే బాటిల్‌లో నింపి సింక్, డ్రెయిన్ వంటి ప్రదేశాలలో స్ప్రే చెయ్యాలి. సున్నం నుండి వచ్చే ఘాటైన వాసనకు ఇవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. కనుక ఈ చిట్కాలను పాటించి వీటి బెడద తగ్గించుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news