మోడీ నన్ను ఫాలో అవుతున్నాడు… అందుకే లోకల్ బీజేపీ నాయకులకు నన్ను చుస్తే అసూయ కలుగుతుందని చురకలు అంటించారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనపై మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కులగణనపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తే మోడీ ప్రధాని అయ్యాక ఆ నివేదికను కాలగర్భంలో కలిపేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ 11 ఏళ్లలో కులగణన విషయంలో మోడీ ఎలాంటి ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ఎలాంటి వివాదాలు లేకుండా విజయవంతంగా కులగణన పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని తెలిపారు. తెలంగాణ ప్రజలు, బలహీన వర్గాల తరఫున రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కులగణన ఎప్పడు మొదలు పెట్టి ఎప్పడు పూర్తి చేస్తారో నరేంద్ర మోడీ చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి.