తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గొప్ప మనసు చాటుకున్నారు. ఓ సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్లి భోజనం చేశారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. గులాబీ పార్టీ సాధారణ కార్యకర్త కుమారుడి వివాహానికి తాజాగా కేసీఆర్ దంపతులు వెళ్లారు.

గులాబీ పార్టీ కార్యకర్త, ఎర్రబెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ – వెంకటయ్య యాదవుల కుమారుడు విష్ణువర్ధన్ వివాహం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే ఆయన సతీమణి శోభమ్మ ఇద్దరు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎర్రవల్లిలోనే కల్వకుంట్ల చంద్ర శేఖర రావు ఉంటున్న నేపథ్యంలో… దంపతులు ఇద్దరు ఈ వివాహానికి వెళ్లారు. అటు ఇటీవల వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్…. ఇప్పుడు మరోసారి పెళ్లి వేడుకలో మెరిశారు.
బీఆర్ఎస్ కార్యకర్త కుమారుడి వివాహానికి హాజరైన కేసీఆర్ దంపతులు
బీఆర్ఎస్ కార్యకర్త, ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ వెంకటయ్య యాదవ్‌ల కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభమ్మ దంపతులు pic.twitter.com/0MLh8GhDPE
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2025