ప్రతిరోజు గొడవలు పడుతూ ఉంటే.. ఈ వస్తువులను ఇంట్లో ఉంచాల్సిందే..!

-

సహజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి. అయితే సరైన విధంగా వాటిని పరిష్కరించుకుంటే ప్రశాంతంగా జీవించవచ్చు. కాకపోతే, పదేపదే సమస్యలు ఎదురవుతున్నట్లయితే తగిన జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాలి. అందరూ సంతోషంగా ఉండాలని ఆశిస్తారు దానికోసం ఇతరులు చెప్పిన నియమాలను కూడా పాటిస్తూ వస్తారు. అదేవిధంగా, వాస్తు శాస్త్రం ప్రకారం ఎటువంటి గొడవలు లేకుండా ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణాన్ని పొందాలంటే, ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదు. ఎప్పుడైతే ఇంట్లో సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుందో ఎటువంటి గొడవలు లేకుండా ఉంటాయి. కనుక కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉండాలంటే ఇంట్లో ఈ వస్తువులను ఉంచాలి.

 

ఇంట్లో తులసి మొక్కను పెట్టడం వలన ప్రతికూల శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో ఎంతో సంతోషంగా జీవించవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు తులసి మొక్కకి నీళ్లు పోస్తే కొత్త శక్తి వస్తుంది. ఈ విధంగా ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో తులసి మొక్కను పెడితే మేలు అని పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో పంచముఖి ఆంజనేయస్వామి ఫోటోని పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ముఖ్యంగా చెడు కన్నుకు సంబంధించిన సమస్యలు దరిచేరు. అయితే, దక్షిణ దిశలో పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటోలు పెట్టడం వలన చాలా ఉపయోగం ఉంటుంది.

ముఖ్యంగా ఎంతో ఆనందంగా మరియు ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు. ఇంట్లో రాగి లేక ఇత్తడి బిందిలో నీటిని నింపి పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుంది. అయితే నీటి బిందెను ఇంటి ఈశాన్యం మూలలో పెడితే చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారాలంటే వినాయకుడు మరియు లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టాలి. వీటి వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. కనుక ఇటువంటి వస్తువులను ఇంట్లో ఉంచి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news