వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా మారాలి : మోదీ

-

అమరావతి పునర్ నిర్మాణ పనులకు వెలగపూడిలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. సభా వేదిక పైనుంచే 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ. రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అయితే.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సభలో మాట్లాడుతూ.. 2015లో అమరావతికి ప్రజా రాజధానిగా శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. గత పదేళ్లుగా అమరావతి అభివృద్ధికి కేంద్రం అన్నిరకాల మద్దతు అందించిందని తెలిపారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు సహా అన్ని నిర్మాణాలకు కేంద్ర సహకారం అందిస్తోందని వివరించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ కలలను సాకారం చేయాల్సిన అవసరాన్ని మోదీ ప్రస్తావించారు. “వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా మారాలి. మనందరం కలిసి పనిచేస్తే అది సాధ్యమవుతుంది,” అని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌ పేరుని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “ఇది మనం చేయాలి.. మనమే చేయాలి” అని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో రైలు, రోడ్డు ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ప్రధాని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచిందని, దీనికి ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించనుందని ఆయన స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news